బెజవాడ సుబ్బయ్య గారి హోటల్ సీజ్..!

-

బెజవాడ సుబ్బయ్య గారి హోటల్ ను సీజ్ చేసారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే హోటల్ లో ఓ కస్టమర్ భోజనం చేస్తుండగా అందులో జెర్రీ వచ్చింది. అది చూసి షాక్ అయిన కస్టమర్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే అదే సమయంలో హోటల్ లో భోజనం చేస్తున్నారు కేంద్ర HRC ఇన్చార్జి చైర్మన్ విజయభారతి సయానీ. భోజనంలో జెర్రీ రావడంతో షాక్ కు గురైన కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్.. కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకులు తీరుపై సీరియస్ అయ్యారు.

ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కార్పొరేషన్ అధికారులు పరిశీలన జరిపారు. అనంతరం హోటల్ సీజ్ చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు అధికారులు. ఇక ఆ హోటల్ లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు అధికారులు. ఇక మంచి పేరున సుబ్బయ్య గారి లాంటి హోటల్ లో.. భోజనంలో జెర్రీ అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version