ప్రయాణికులకు గుడ్ న్యూస్. వేసవిలో రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ – బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ-ఎస్‌ఎంవీ బెంగళూరు (08549) ప్రత్యేక రైలు ఈ నెల 27వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖలో బయలు దేరనున్నట్లు చెప్పారు. మర్నాడు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని వెల్లడించారు.
ఎస్‌ఎంవీ బెంగళూరు – విశాఖ (08550) ప్రత్యేక రైలు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు విశాఖ వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది వేసవిలో 6,369 ట్రిప్పులు నడపగా ఈసారి దానిని 9,111కి పెంచినట్లు వెల్లడించింది.