స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న హెచ్ఎం.. వీడియో తీసిన టీచర్ పై దాడి

-

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్‌ పనివేళల్లో ఫేషియల్‌ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. విద్యార్థులకు ఆహారం వండే గదిలో సంగీతా సింగ్‌ ఫేషియల్‌ చేయించుకోగా అనమ్‌ ఖాన్‌ అనే టీచర్ దాన్ని వీడియో తీశారు. ఇది గమనించిన సంగీతా సింగ్‌ ఒక్కసారిగా కుర్చీపై నుంచి లేచి అనమ్పై దాడికి తెగబడ్డారు. ఫోను లాక్కొనే క్రమంలో చేయిని కొరకడంతో అనమ్‌ ఖాన్‌కు రక్త గాయమైంది.

తాను గాయాలతో ఉన్న వీడియోను కలిపి రెండింటినీ అనమ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటన వ్యవహారంలో ప్రధానోపాధ్యాయురాలిపై విచారణకు ఆదేశించారు. అనమ్‌ను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version