దేవినేని అవినాశ్, జోగి రమేశ్ కు సుప్రీంకోర్టులో ఊరట

-

సుప్రీంకోర్టులో దేవినేని అవినాష్‌కు బిగ్‌ రిలీఫ్‌. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేత దేవినేని అవినాష్‌, జోగి రమేశ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈరోజు అంటే మంగళవారం రోజున దేవినేని అవినాష్, తదితరుల బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే జారీ అయిన ముందస్తు బెయిల్‌ను పొడిగిస్తూ పలు షరతులను విధించింది.

Supreme Court acquitted YCP leader Devineni Avinash in the case of attack on TDP office

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అవినాష్ సహా ఇతరులు విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చంద్రబాబు ఇల్లు, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా 20 మంది నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news