ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుందని భావించినా.. బుధ వారానికి వాయిదా పడింది.
చంద్రబాబు కేసును సుప్రీంకోర్టు మరో బెంచీ కి బదిలీ చేశారు. విచారణ వాయిదా వేశారు. వచ్చే వారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. ఎలాంటి విచారణ జరుగలేదు. ఎఫ్ఐఆర్ పై స్టే విధించాలి.. జరుగుతున్న విచారణ నిలిపి వేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. చంద్రబాబు పిటిషన్ ను నాట్ బిఫోర్ మి అన్న జస్టిస్ భట్, సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచారణ చేపట్టేందుకు చంద్రబాబు కేసును అంగీకరించలేదు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు ధర్మాసనం ముందు ఈ కేసులో మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. మరోవైపు సుప్రీకోర్టుకు రేపటి నుంచి సెలవులున్నాయి. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.