భారత్‌లోని పలు ఐటీ, ఎడ్టెక్ సంస్థల్లో ఇంకా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీల్లో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలోని అతిపెద్ద ఎడ్టెక్ కంపెనీ బైజూస్ కూడా పలువురు ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు బైజూస్ మరో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సంస్థ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. అందువల్లే భారం తగ్గించుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే అర్జున్ మోహన్ బైజూస్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే సంస్థ పునర్వ్యవస్థీకరణకు ఆయన ప్లాన్ రెడీ చేశారు. అందులో భాగంగా ఈ ఏడాది దాదాపు 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కరోనా సమయంలో బైజూస్ కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాఠశాలలు, కళాశాలలు అన్నీ మూసివేయడం వల్ల డిజిటల్ ఎడ్యుకేషన్‌కు మంచి ఆదరణ ఉండింది. ఆ సమయంలో ఈ కంపెనీ లాభాల బాట పట్టింది. కానీ కరోనా కనుమరుగైన తర్వాత ఎడ్టెక్ సంస్థలు ఒక్కొక్కటిగా క్షీణించడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బైజూస్‌పై తీవ్రమైన ఆర్థికభారం పడింది.