తిరుమల సన్నిధిలో నిన్న తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలిక పై చిరుత దాడి చేసి.. చంపేసింది. అయితే.. నడకమార్గంలో బాలిక పై చిరుత దాడి నేఫధ్యంలో అప్రమత్తమైంది టీటీడీ. ఘట్ రోడ్డులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చింది టీటీడీ. నడకమార్గంలో భక్తులును అనుమతించే సమయాలను కూడా నియంత్రిం చాలంటున్నారు అటవిశాఖ అధికారులు.
అలాగే.. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే చిన్న పిల్లలు ట్యాగ్ లు కడుతున్నారు టీటీడీ సిబ్బంది. ట్యాగ్ లో తండ్రి ఫోన్ నెంబర్ ..పోలీసులు కంట్రోల్ నెంబర్ రాసి పిల్లలకు కడుతున్నారు. అలాగే… సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులును గుంపులుగా అనుమతిస్తున్నారు. భక్తులు బృందానికి ముందు, వెనుక వైపుల రోప్ పార్టీలు…పైలేట్ గా సెక్యూరిటి గార్డులను నియామకం చేయనుంది.