సరస్వతీ పవన్ కంపెనీ కి పల్నాడు జిల్లాలో ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక వర ప్రసాద్ డిమాండ్ చేశారు. సరస్వతీ కంపెనీ 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇప్పటివరకు ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.. సొసైటీ ద్వారా రైతులకు కౌలుకు ఇవ్వాలని సూచించారు.
అలా చేయకపోతే పారిశ్రామిక వేత్తలకు నూతనంగా కేటాయించాలన్నారు. దీంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని.. ఉపాధి సైతం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆస్తుల వ్యవహారంలో వై.ఎస్. విజయమ్మ, షర్మిల కు ప్రాణ హాని ఉన్నదని.. వారికి భద్రత పెంచాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.