ఏపీలో అన్న క్యాంటీన్ ల పరిస్థితి దారుణం… ఇదిగో వీడియో?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అన్న క్యాంటీన్లు ప్రారంభించింది చంద్రబాబు సర్కార్. ఆగస్టు 15వ తేదీన చాలా అట్టహాసంగా… ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించింది చంద్రబాబు సర్కార్. ఒకేరోజు 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లి అన్న క్యాంటీన్ ప్రారంభించారు.

Tanuku Anna canteen

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో అన్నా క్యాంటీలను ప్రారంభించడం జరిగింది. అయితే తాజాగా అన్న క్యాంటీన్లకు సంబంధించిన వీడియో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. తణుకులో ప్రారంభించిన అన్న క్యాంటీన్లో… దారుణ విషయం బయటపడింది. వాష్ బేసిన్ లోనే… అన్న క్యాంటీన్ ప్లేట్లు కడుగుతున్నారు అక్కడి సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియోను వైసిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో నే కాకుండా ఏపీ రాజకీయాల్లో.. విపరీతంగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news