TDP leader Ashok Gajapathi Raj: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు బంపర్ ఆఫర్ దక్కింది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది.

గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇవ్వగా.. హరియాణా గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ ఘోష్‌ను, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీదుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్తగా గవర్నర్ గా నియామకమైన అశోక గజపతి రాజు… గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా గతంలో పనిచేసిన అనుభవం అశోక్ గజపతిరాజుకు ఉంది.