కొత్త రేషన్ కార్డు దారులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొత్త రేషన్ కార్డులపై మోదీ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేశారు ఎన్ రామచందర్ రావు. రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే అధిక వాటా అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు.

దింతో కొత్త రేషన్ కార్డు దారులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ,ఇవాళ నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం తిరుమలగిరి బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ జరుగనుంది.