గీతాంజలి మృతి కేసులో టిడిపి నేత రాంబాబు అరెస్ట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి వ్యవహారంలో… ఆ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా అతిగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.. వారి వేధింపులకు బలైన తరువాత కూడా.. అయితే.. గీతాంజలి కేసులో ట్విస్ట్ నెలకొంది.
గీతాంజలి ఆత్మహత్య కేసులో ఆమె మీద జుగుప్సాకరమైన ట్వీట్లు పెట్టి ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నాయకుడు రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు జగన్ మాట్లాడుతూ గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పై ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు ఆమె మరణం తనని తీవ్రంగా కలచివేస్తుంది అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని కచ్చితంగా అదుకుంటామన్నారు మహిళల ప్రతిష్ట మర్యాదకు భంగం కలిగిస్తే చట్టం ఏ ఒక్కరిని వదిలిపెట్టదన్నారు సీఎం జగన్ ఆమెకి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.