టీడీపీ పొలిట్ బ్యూరోలో పెను మార్పులు జరగబోతున్నాయా…?

-

టిడిపి అత్యున్నత బాడీ పొలిట్ బ్యూరోలో మార్పులు జరగబోతున్నాయా?….రాష్ట్ర కమిటీ నియామకం ప్రభావం పొలిట్ బ్యూరో పైనా ఉంటుందా..? గల్లా అరుణ స్థానంలో అధినేత ఎవర్ని నియమిస్తారు? ఒక్క సారి పొలిట్ బ్యూరోలో బుచ్చయ్య చౌదరికి ఇప్పటికైనా అవకాశం లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది…

ఏపీ టిడిపి రాష్ట్ర కమిటీని ఈ వారంలో ప్రకటించనున్నారు. ఈ కమిటీ ప్రకటన సందర్భంగానే పొలిట్ బ్యూరోలోనూ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. 16 మంది సభ్యులున్న టీడీపీ పొలిట్ బ్యూరోలో ఇప్పటికే కొందరు వెళ్లిపోగా…. ఆ స్థానాలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. కొద్దినెలల క్రితం వర్ల రామయ్యను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న అధిష్టానం… ఇప్పుడు మరి కొన్ని మార్పులు.. చేర్పులు చేయనున్నట్టు సమాచారం.

టిడిపి పొలిట్ బ్యూరోలో చిత్తూరు జల్లా నుంచే నలుగురు సభ్యులు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు…..గల్లా అరుణ కుమారి, గల్లా జయదేవ్ పొలిట్ బ్యూరో లో ఉన్నారు. అయితే కొద్దిరోజుల క్రితమే గల్లా అరుణ కుమారి ఆ పదవి నుంచి వైదొలిగారు. వ్యక్తి గత కారణాలు, వయో భారంతోనే వైదొలిగినట్టు ఆమె ప్రకటించినా….ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పొలిట్ బ్యూరోలో ఉండడంపై అభ్యంతరాలు ఉన్నాయి. ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ హోదాలో.. పొలిట్ బ్యూరోలో ఉన్నారు. దీంతో గల్లా అరుణ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర అద్యక్షుని మార్పు కారణంగా కాల్వను పొలిట్ బ్యూరో లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్నాళ్ల క్రితం వర్ల రామయ్యను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.

పార్టీ ఆవిర్భావ నుంచి కొనసాగుతున్న వారిలో యనమల,కేఈ , అయ్యన్న, ఆశోక్ గజపతి రాజు పొలిట్ బ్యూరోలో ఉన్నారు. ఆ తరువాత పార్టీలో చేరిన వారు కూడా పొలిట్ బ్యూరోలో అవకాశం దక్కించుకున్నారు. అయితే పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మాత్రం ఇప్పటివరకూ పోలిట్‌ బ్యూరోలో చోటు దక్కలేదు. అయితే, ఇప్పుడు కమ్మ వర్గం నుంచి ఒకరికి పొలిట్ బ్యూరోలోకి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుండగా.. బుచ్చయ్యకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది.

పయ్యావుల, దూళిపాళ్ల పేర్లు కూడా పరిశీనలలో ఉన్నాయి. కానీ సీనియారిటీ పరంగా బుచ్చయ్యకే చంద్రబాబు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. గోరంట్ల కూడా పార్టీ కోసం అత్యంత నిబద్దతతో ఉన్న నేతగా గుర్తింపు పొందారు.బుచ్చయ్య చౌదరి విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగిందని కొందరు చెపుతుండగా….చివరి నిముషంలో అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version