తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి వాటర్ పై యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన గోదావరి నీళ్లను చెంబులు అలాగే బిందెలతో ఆపుకోండి అంటూ.. బాంబు పేల్చారు.

గులాబీ అలాగే కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఆ గోదారి వరదను ఆపండి అయ్యా… గులాబీ పార్టీ నాయకులైనా.. బిందెలు అడ్డం పెట్టండి అంటూ చురకలు అంటించారు. కనీసం కాంగ్రెస్ నాయకులైన చెంబులతో నీటిని ఆపండి అంటూ సెటైర్లు పేల్చారు.
ప్రతిరోజు 50 నుంచి 60 టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే మీరేం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే దీనిపై గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా తెలంగాణ నీటిని తీసుకువెళ్తున్నారని సోమిరెడ్డిని టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారు.
ఆ గోదావరి వరదను ఆపండయ్యా
బీఆర్ఎస్ నాయకులైనా బిందెలు అడ్డం పెట్టొచ్చు కదా..కనీసం కాంగ్రెసోళ్లు చెంబులతో అయినా ఆపండయ్యా..రోజుకు 50, 60 టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారన్నా మీరు..@BRSparty @INCTelangana pic.twitter.com/KdboO8BuYC
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) July 13, 2025