టీడీపీ దారుణంగా అనుమానించింది.. గొల్లపల్లి సూర్యరావు కీలక వ్యాఖ్యలు

-

తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సూర్యారావు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. టీడీపీలో నిబద్ధతతో పని చేసిన తనని మెడబట్టుకుని గెంటేశారని మీడియా ముందు సూర్యారావు వాపోయారు.

నిబద్ధతతో పని చేసిన నన్ను టీడీపీ దారుణంగా అవమానించింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లు చూశారు. అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారు. లోకేష్ దుర్మార్గపు రీతిలో ఆ పార్టీని నడిపిస్తున్నాడు. ఆ బాధలో ఉన్న నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు నన్ను మెడపట్టుకుని బయటకు గెంటారు. జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కోసం శాయశక్తుల పని చేస్తా.. “అని సూర్యారావు చెప్పారు. మాజీ మంత్రి సూర్యారావుతో పాటు పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్సార్సీపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version