తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీ అధికారంలోకి రాదు : మంత్రి ధర్మాన

-

తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీ అధికారంలోకి రాదు అని ఏపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. దమ్ముంటే చంద్రబాబు నర్సన్నపేటలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు మంత్రి ధర్మాన. టీడీపీ హయాంలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వల్లనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. 

చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఐటీ నోసులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రూ.118 కోట్లు అక్రమ మార్గంలో చేరాయని స్వయంగా ఐటీనే వెల్లడించిందని గుర్తు చేశారు. అసలు ఆ డబ్బు ఎలా వచ్చిందో ఎందుకు చెప్పరు అని ప్రశ్నించారు. టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలో ఇతరులు ఎవ్వరూ భూమి కొనుగోలు చేయకుండా చట్టం సృష్టించాడని.. అదేవిధంగా పోలవరంను ఏటీఎం మాదిరిగా వాడుకున్నాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. ఈ విషయం చంద్రబాబు స్పందించకపోవడం గమనార్హం. 

Read more RELATED
Recommended to you

Latest news