బాబాయి హత్య కేసు గురించి జగన్ ఎందుకు మాట్లాడరు..? : మాజీ మంత్రి నక్కా ఆనంద్

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చిన నోటీసుల అంశంపై స్పందించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడూ జగన్ తరహాలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకోలేదు అన్నారు.చంద్రబాబు జగన్ చేసినట్టు అక్రమాలు చేయలేదు.. జైలుకు వెళ్లలేదు అని.. జగన్ తరహాలో చంద్రబాబు ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్న నేత కాదన్నారు.

బాబాయి హత్య కేసు గురించి జగన్ ఎందుకు మాట్లాడరు..? సీఎం జగన్ బాబాయి వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యింది.. ముందు దానికి సమాధానం చెప్పాలన్నారు. వివేకాను జగన్.. ఆయన తమ్ముడు అవినాష్ హత్య చేశారని తేలింది.వాటికి సమాధానం చెప్పలేక బెయిల్ పై సుప్రీం విచారణ జరుగుతున్న సమయంలో  డైవర్షన్ కోసం చంద్రబాబుకు నోటీసులు అంటూ ప్రచారం చేశారు. అవినాష్ రెడ్డి కేసులో ఉచ్చు బిగుసుకుంటోంది. అవినాష్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.ఇలాంటి సమస్యలను పక్కదారి పట్టించడానికి చంద్రబాబుకు నోటీసులు అంటూ వైసీపీ చౌకబారు ఎత్తుగడలు వేస్తుందన్నారు.

 

గత రెండు రోజుల నుంచి మంత్రులు ఏదో జరిగిపోయింది అని హడావుడి చేస్తున్నారు. అసలు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని కూడా జగన్ మేనేజ్ చేశాడు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలతో దాడుగు మూతలు అడుతున్నాడనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ముందు జగన్ తన బతుకేంటో చూసుకోవాలి. డైవర్షన్ పాలిటిక్స్ అనేది జగన్ పార్టీ సిద్దాంతంలోనే ఉంది.. నాడు అంతే నేడు అంతే.ప్రభుత్వ దోపిడీలు, దుర్మార్గాలు ఎత్తి చూపిన ప్రతి సారి ఇలాంటి అంశాలు ఏవోవో తెర పైకి తెస్తారు. చేతిలో ఉన్న చెత్త సోషల్ మీడియాను పెట్టుకుని ఎప్పుడూ తప్పుడు ప్రచారం చేస్తుంటారు. చంద్రబాబుపై వీళ్ల ఆరోపణలు కొత్త కాదు.వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు, ఆ తరువాత విజయమ్మ అనేక కేసులు వేశారు.అలా మళ్లీ బురద జల్లే కార్యక్రమంలో భాగమే నేటి వైసీపీ ప్రచారం. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news