విజయవాడలో స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌

-

విజయవాడలో స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడటం లేదని ఓ టీచర్ను సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో పాఠశాల యాజమాన్యం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే..?

స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌లోని మెసేజ్‌లు చూడడం లేదని మొగల్రాజపురం బీఎస్‌ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్‌ను సస్పెండ్‌ చేశారు. తనకు కంటి సంబంధిత సమస్య ఉండడంతో స్మార్ట్‌ఫోన్‌ వాడొద్దని వైద్యులు సూచించారని రమేష్‌ వివరణ ఇచ్చినా.. వ్యక్తిగత విషయాన్ని సాకుగా చూపిస్తూ సస్పెండ్‌ చేశారని బాధితుడు వాపోయారు.

 

ఈ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో వెంటనే సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వాట్సాప్‌ గ్రూపు నుంచి రమేష్‌ అకస్మాత్తుగా వెళ్లిపోవడం, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version