ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్ పో ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ ఎక్స్ పో లో నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్ షాపులు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేకం అన్నారు. ఆలయాలకు వచ్చిన విరాళాలను పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో ఆలయాలది కీలక పాత్ర అన్నారు. ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగు వేయాలి అని పేర్కొన్నారు.