అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ

-

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్​కు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ నోటీసులతో అరెస్టు తప్పదని భావించిన అవినాష్.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ముందు భోజన విరామ సమయంలో ముందస్తు బెయిలు పిటిషన్‌ విచారణకు అనుమతించాలని అవినాష్‌ తరఫు న్యాయవాది ఉదయం అభ్యర్థించారు. దీంతో సీజే అనుమతితో జస్టిస్‌ కె.సురేందర్‌ మధ్యాహ్నం విచారణ చేపట్టారు.

అవినాష్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ… ‘‘’దస్తగిరి క్షమాభిక్షను రద్దుచేయాలని పిటిషనర్‌ తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉండగానే ఆయన్ను అరెస్టు చేశారు. ఇప్పుడు అవినాష్ విషయంలోనూ అదే జరుగుతందని’ అనగా.. గతంలో సీఆర్‌పీసీ 160 కింద నోటీసు కింద విచారణకు నాలుగుసార్లు హాజరయ్యారని చెబుతున్నారని, ఇప్పుడెందుకు అరెస్టు చేస్తారని ఊహిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘గతంలో పిటిషనర్‌ తండ్రికి కూడా నోటీసు ఇచ్చారని, ఇక్కడ కోర్టులో పిటిషన్‌పై తన వాదనలు ముగిసిన నేపథ్యంలో ఊహించని విధంగా అరెస్టు చేశారని’ అన్నారు. ఇప్పుడూ పిటిషనర్‌ను సాక్షిగా పిలిచారని, అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలిపారు.

అరెస్టు చేయాలని ఉన్నప్పుడు 160 కింద ఎలా నోటీసు ఇచ్చారని, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసు ఎందుకు ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీబీఐ న్యాయవాది సమాధానమిస్తూ ‘‘ప్రస్తుతం ఉన్న వివరాల మేరకు సాక్షిగానే విచారణకు పిలిచాం. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా అవసరమైతే అరెస్టు చేస్తాం.

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పిటిషన్‌పై విచారణ పూర్తికాకపోవడంతో మంగళవారం కూడా వాదనలు వింటామని, పిటిషనర్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాతే విచారణకు పిలవాలని సీబీఐకి సూచించింది. దీనికి సీబీఐ కూడా అంగీకరించడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version