The AP government will introduce 3 bills in the assembly today: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అనంతరం ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నారాయణ. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఈ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానుంది ఏపీ సర్కార్.