తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు అదిరిపోయే శుభవార్త అందించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్ర రైతులకు అవసరమైన ఉపకరణాలను యంత్రాలను రాయితీపై అందిస్తామని ముందుకు వచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో భాగంగానే…మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. వ్యవసాయానికి అవసరమైన….. రోటోవేటర్లు, కల్టివేటర్లు, నాగళ్ళు, ట్రాక్టర్లు, పవర్ వీడర్లు, తైవాన్ స్ప్రేయర్లు, కిసాన్ డ్రోన్లను ఉపకరణాలను యంత్రాలను రాయితీపై అందిస్తామని ప్రకటన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారిగా ఉన్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.