ఏపీ శాసన మండలిలో రగడ..!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా  మెడికల్ కాలేజీల పై చర్చ సందర్భంగా  వంద ఎలుకలు తిన్న పిల్లి.. హజ్ యాత్రకు వెళ్లినట్టుగా వైసీపీ మాట్లాడుతోందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు.

Minister Satyakumar

మతాలు, వ్యక్తులను చర్చలోకి దూషించడం సరికాదు అని శాసనమండలి ప్రతిపక్ష నేత భొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. హజ్ యాత్రను ఎక్కడ అవమానపరచలేదని కూటమి మంత్రులు పేర్కొన్నారు. వాస్తవానికి మంత్రి సత్యకుమార్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదన్నారు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా దీనిపై స్పందించి మంత్రి సత్యకుమార్ వివాదస్పద వ్యాఖ్యలు ఏమి చేయలేదన్నారు. మరోవైపు తాను మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను. రికార్డుల్లోంచి తొలగించండి అంటూ మంత్రి సత్యకుమార్ మండలి చైర్మన్ ను కోరారు. మండలి చైర్మన్ రికార్డుల్లోంచి తొలగిస్తానని తెలపడంతో వివాదం సద్దు మనిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version