ఇది తరతరాలకు మేలు చేసే నిర్ణయం.. అడ్డుపడొద్దు : సీఎం రేవంత్ ట్వీట్

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన, హైడ్రా నిర్ణయాలపై ప్రజల్లో నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు దాన్ని రాజకీయాలు చేస్తున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ చేసీన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గురువారం ఉదయం ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ..‘నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి…నదులను కబళిస్తే… మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

ప్రజా ఆరోగ్యం…పటిష్ఠ ఆర్ధికం…పర్యావరణ కోణాల్లో… ప్రపంచ స్థాయి ప్రమాణాలతో…అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి…కానీ,శాపంగా మిగిలిపోకూడదు. మూసీ ప్రక్షాళన చేయాలన్న…ప్రజా ప్రభుత్వ సంకల్పం…ఈ తరానికే కాదు…తరతరాలకు మేలు చేసే నిర్ణయం.ఈ నిర్ణయానికి అండగా నిలిచే…ప్రతి వ్యక్తికి…ప్రతి వ్యవస్థకి… ధన్యవాదాలు’ అని తెలుపుతూ పేపర్ క్లిప్పింగులను అటాచ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version