పిల్లలకు చిన్నతనం నుంచే కష్టం అంటే ఏంటో తెలియాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన లోక్ మంథన్ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. భారత మూలాల గురించి తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. భారత సంస్కృతిని వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ప్రకృతిని ఎదుర్కోవడం అందరి బాధ్యత. అమ్మ భాషకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లలను సున్నితంగా పెంచకుండా..చిన్న తనం నుంచే కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచాలని సూచించారు.
కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలన్నారు.పెద్దలను గౌరవించేలా పిల్లలను పెంచాలని హితవు పలికారు. కాగా, ఈ కార్యక్రమం శిల్పారామంలో గురువారం నుంచి 24 వరకు 4 రోజుల పాటు జరుగనుంది. 2016లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లోకమంథన్‌ను వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో బీజేపీ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తోంది.