ఒంగోలులో దారుణం..కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్

-

ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకుని తుపాకీతో కాల్చి చంపాడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొదుముల ప్రసాద్. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొదుముల ప్రసాద్..ఒకటో తేదీ కావటంతో తన ఖాతాలో పడ్డ జీతంలో 20 డ్రా చేశాడు.

The constable who shot his son dead

డ్రా చేసిన డబ్బును తనకు ఇవ్వాలని తండ్రిని అడిగాడు కొడుకు శేష సాయి కమల్ (20). డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు శేష సాయి కమల్. తన తండ్రిని జీతం అడగటంతో కోపోద్రిక్తుడైయ్యాడు తండ్రి ప్రసాద్. అనంతరం కన్న కొడుకుని తుపాకీతో కాల్చి చంపాడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొదుముల ప్రసాద్. ఓల్డ్ ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూర్టీ గా ఉన్నాడు కానిస్టేబుల్ ప్రసాద్.

డిగ్రీ పూర్తి చేసి పోలీస్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు శేషసాయి కమల్. 1998 బ్యాచ్ కు చెందిన వాడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొదుముల ప్రసాద్. ఇక కానిస్టేబుల్ కొదుముల ప్రసాద్…కొడుకు మృతదేహాన్ని రిమ్స్ కు తరలించి విచారణ చేపడుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version