తొలి పులస..వలకు చిక్కింది. తొలి పులస కేజిన్నర రూ. 24,000 రికార్డ్ ధర పలికింది. పుస్తెలు అమ్మైన పులస కూర తినాలని సామెత ఉంది. దింతో గోదావరి నీళ్లలో వచ్చే పులసకు అంత డిమాండ్ నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన ఓ మత్స్యకారుడి వలకు ఎర్ర నీళ్ల గోదావరిలో ఎదురెక్కిన కేజిన్నర పులస పడింది.
ఈ కేజిన్నర పులసకు వేలం పెట్టగా అనేక మంది పోటీ పడి పోటాపోటీగా జరిగిన ఈ వేలంలో అప్పన రాముని లంకకి చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000 కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. దింతో తొలి పులసకు ఉన్న ప్రత్యేకత పై అందరు చర్చించుకుంటున్నారు.