సైకో పరిపాలన అంతమైతేనే రాష్ట్రానికి భవిష్యత్తు – గోరంట్ల బుచ్చయ్య

-

తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చేరుకుంది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ధవళేశ్వరం టిడ్కో గృహాలు, బాలాజీపేట రోడ్డులో గుంతల వద్ద ధర్నాలు నిర్వహించారు టిడిపి శ్రేణులు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ 2లక్షల 47వేల కోట్ల రూపాయలు అంటున్నారని.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చటం లేదని మండిపడ్డారు.

పంచాయతీలకు నిధులు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో బాలాజీపేట రోడ్లను మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు గోరంట్ల బుచ్చయ్య. లేదంటే సొంత ఖర్చులతో మేమే గుంతలు పూడ్చివేస్తామన్నారు. సైకో పరిపాలన అంతమైతేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version