BREAKING: వైసిపి నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ద్వంసం సహా మూడు హత్యయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈనెల 6 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాల్టితో ఆ గడువు ముగియనుంది.

దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
- నేటితో ముగియనున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్
- EVM ధ్వంసం సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లి నీ
అరెస్టు చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశం - కౌంటింగ్ నేపథ్యంలో ఇవాల్టి వరకు అరెస్ట్ చేయవద్దని గతంలో ఆదేశాలు
- నేడు విచారణ చేయనున్న వెకేషన్ బెంచ్