టాలీవుడ్ నటి హేమకు మరో షాక్..!

-

Actress Hema suspended from Ma Association: నటి హేమ “మా అసోసియేషన్” నుంచి సస్పెండ్ అయింది. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు గట్టి షాక్ తగిలింది. నటి హేమ ను సస్పెండ్ చేసిన “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్”….ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Actress Hema suspended from Ma Association

దీనిపై “మా” అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా హేమా ప్రస్తుతం బెంగళూరులోని పరప అగ్రహార జైల్లో ఉన్నారు. కాగా, గత నెలలో కర్ణాటక బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. ఇందులో భాగంగా నటి హేమను తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు ఇచ్చారు.

మే 27న రావాలని తొలుత నోటీసులు ఇవ్వగా, తనకు జ్వరం కారణంగా రాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలంటూ ఆమె కోరారు. జూన్ 1న విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. అప్పుడూ డుమ్మా కొట్టడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి, విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news