మంత్రులకు కౌంట్‌ డైన్‌.. ఈ నెల 7వ తేదీన ఏపీ కేబినేట్‌ కీలక సమావేశం

0
93

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. అతి త్వరలోనే మాజీలు కానున్న మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ నెల ఏడున ఏపీ మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఏడు, ఎనిమిది తేదీలలో మాజీలతో ఒన్ టు ఒన్ కలవనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి.

కొందరితో మాత్రం లంచ్, డిన్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. మాజీల మనసులోని మాటలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయనున్నారు సీఎం జగన్.

వారిలోని అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేయనున్న ముఖ్యమంత్రి… ప్రభుత్వంలో పదవులు పోయినా, పార్టీలో కీలక పోస్టులు అప్పగించే యోచనలో ఉన్నారు. క్యాబినెట్ కంటే పార్టీ పోస్టుల కంటే తాను అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సర్ది చెప్పనున్నారు సీఎం జగన్. అయితే.. ఈ కేబినేట్‌ ప్రక్షాళనంలో..ముగ్గురు మినహా అందరినీ మార్చేందుకు జగన్‌ సిద్దమైనట్లు తెలుస్తోంది.