AP: రైల్వేస్టేషన్‌ లిఫ్టులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు.. 3 గంటలు నరకయాతన..!

-

రైల్వేస్టేషన్‌ లిఫ్టులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు.. 3 గంటలు నరకయాతన అనుభవించారు. ఈ సంఘటన ఏపీలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారం మారేందుకు 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో ఆగిపోయింది లిఫ్ట్.

The passengers stuck in the railway station lift experienced hell for 3 hours

తలుపులు తెరుచుకోకపోవడంతో.. దాదాపు 3 గంటలు అందులోనే ఉండిపోయింది సదరు ప్రయాణికులు. ప్రయాణికులు కేకలు విని లిఫ్ట్ వద్దకు వచ్చారు పోలీసులు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడారు పోలీసులు. ఇక ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news