BREAKING : పవన్ కళ్యాణ్‌ కు ముద్రగడ మరో లేఖ

-

BREAKING : పవన్ కళ్యాణ్‌ కు ముద్రగడ మరో లేఖ రాశారు. కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండని పవన్‌ కళ్యాణ్‌ సవాళ్‌ చేశారు. ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండని ముద్రగడ పేర్కొన్నారు.

చేగువేరా మీకు ఆదర్శం అంటారు గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్తారు ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని భావిస్తున్నాను… మీరు మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం అని చెప్పారు. మీ బెదిరింపులకు భయపడి నేను లొంగుబాటుకు రానని..గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు.. దమ్ముంటే మీరు నన్ను తిట్టండని సవాల్‌ చేశారు. నేను మీ బానిసను కాదు మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version