కడపలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ కూడా చేశారు పోలీసులు. కడప కార్పొరేషన్ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చారు వందల మంది టిడిపి కార్యకర్తలు. అయితే.. టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే మాధవిని వేదికపై కుర్చీ వేసి కూర్చోబెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు టిడిపి కార్యకర్తలు.
అయితే… కార్యకర్తలను అదుపు చేయడానికి లాటి ఛార్జ్ చేసిన పోలీసులు…కొంత మందిని అరెస్ట్ చేస్తున్నారు. కొంత మంది టిడిపి కార్యకర్తలు… కార్పొరేషన్ మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇక ఈ సందర్భంగా కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా మేయర్ మాతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాడన్నారు.
ఎన్నికల్లో టిడిపి సహకారం చేశాడని… టిడిపి తో లోపాయికారీ ఒప్పందం బయట పడుతుందని మొదటి మీటింగ్ కు రాలేదని ఫైర్ అయ్యారు. జగన్ ఒత్తిడి తో రెండవ సమావేశానికి వచ్చాడని… ఎక్స్ అఫీసీయో మెంబర్ కుర్చీ తీసేసి ఆనందం పొందాలనుకున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క మహిళ ఎమ్మెల్యే కు బయపడి పారిపోయారని చురకలు అంటించారు.