రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోంది : చంద్రబాబు

-

రాష్ట్రంలో ఓట్ల నమోదు జరుగుతోన్న అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ లేఖలో పలు విషయాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోంది. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదు. మాన్యువల్ ప్రకారం అన్నీ పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి. ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు వస్తూనే ఉన్నాయి.ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు సర్వే చేసి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలని కోరారు చంద్రబాబు.

Eye operation for Chandrababu today

దురదృష్టవశాత్తు డ్రాప్ట్ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు కూడా దర్శనమిస్తున్నాయి.రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ – 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అర్హత లేని వారికి సైతం ఫామ్ – 6 ద్వారా ఆన్‌లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వీటిపై మా అభ్యంతరాలపై నేటికి దృష్టిపెట్టలేదు. డైరెక్ట్‌ గా గానీ, ఆన్‌లైన్‌లో గానీ బల్క్ ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించరాదు. ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారు. నేటికి ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సంధర్బంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైనల్ లిస్టులో ఓట్ల అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version