తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయ్యి నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 62, 756 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31, 510 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

Tirumala Tickets for the month of August online today at 10 am

ఇక అటు ఇవాళ పలు సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో.. జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  జూన్​ 19 నుంచి జూన్​ 21 వరకు మూడు రోజులపాటు ఈ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

  • తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62756 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 31510 మంది భక్తులు
  • హుండి ఆదాయం 4.23 కోట్లు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version