తిరుమల కొండపై అపచారం…పలావ్, కోడిగుడ్ల కూర దర్శనం !

-

తిరుమల కొండపై అపచారం చోటు చేసుకుంది. తిరుమల కొండపై పలావ్, కోడిగుడ్ల కూర దర్శనం ఇచ్చాయి. తిరుమల కొండపై భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన 28 మంది భక్తులు అలిపిరి ఘాట్ మార్గం నుంచి తిరుమల కొండపైకి చేరుకున్నారు. రాంభగీచ బస్టాండ్‌ వద్ద తమ వెంట తెచ్చుకున్న పలావ్, కోడిగుడ్ల కూర ఆరగించారు.

The security failure on the Tirumala Hill has once again come to light

దీనిని చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. భక్తుల ఫిర్యాదు మేరకు ఆ 28 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే… తిరుమల కొండపై పలావ్, కోడిగుడ్ల కూర దర్శనం ఇవ్వడంపై వైసీపీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version