జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యానని తెలిపారు టాలీవుడ్ నటి మాధవీలత. జేసీ ప్రభాకర్ రెడ్డి రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నాడని… నేను కూడా రాయలసీమ గడ్డ మీదనే పుట్టి, రాగి సంగటి, నాటు కోడి తినే పెరిగానని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి పై మా అసోషియేషన్ కు ఫిర్యాదు చేసింది టాలీవుడ్ నటి మాధవీలత.
ఇక ఫిర్యాదు చేసిన అనంతరం టాలీవుడ్ నటి మాధవీలత.. మాట్లాడారు. సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను ప్రభాకర్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడారని… నన్ను అయితే ఇటు రాజకీయ పరంగా అటు సినిమా పరంగా తిట్టారని ఆగ్రహించారు. నేను బ్రతుకు తెరువు కోసం సినిమా ఇండస్ట్రీ కి రాలేదని… నాకు సినిమాల్లో నటించడం ఇష్టం కాబట్టి వచ్చానని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో లీగల్ గా ముందుకు వెళ్తానన్నారు నటి మాధవీలత.
జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యాను : నటి మాధవీలత
జేసీ ప్రభాకర్ రెడ్డి రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నాడు
నేను కూడా రాయలసీమ గడ్డ మీదనే పుట్టి, రాగి సంగటి, నాటు కోడి తినే పెరిగాను
సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను ప్రభాకర్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడారు
నన్ను అయితే… pic.twitter.com/2ZZ9PQL2dh
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025