జర్నలిస్టు పై మోహన్ బాబు దాడి సరికాదు : మంత్రి పొన్నం ప్రభాకర్

-

గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్ వద్ద ఏం జరుగుతుందనే విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా పై మంచు మోహన్ బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ముఖ్యంగా వారి చేతుల్లోని మైకులను లాక్కొని ఆవేశంతో నేలకేసి కొట్టారు. గేటు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేశాడు. ప్రధానంగా టీవీ-9 ప్రతినిధి రంజీత్ పై తీవ్రంగా దాడి చేశారు మోహన్ బాబు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటన పై స్పందించారు. జల్ పల్లిలో జర్నలిస్ట్ పై సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన దాడి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రిపోర్టర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ దాడి ఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version