TTD లడ్డూ నాణ్యత తగ్గే ఛాన్సే లేదని పోటు సిబ్బంది పేర్కొంది. లడ్డు నాణ్యత తగ్గే అవకాశం లేదని తిరుమల శ్రీవారి ఆలయ పోర్టులో పనిచేస్తున్న శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. తాము కొన్ని తరాలుగా లడ్డు తయారీలో నైపుణ్యం సాధించామని అధికారులతో మీటింగ్ లో తెలిపారు.
తయారీలో వినియోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర, ఎండు ద్రాక్ష, బాదం తదితర దినుసులను దిట్టం మేరకు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇటీవల సోషల్ మీడియాలో లడ్డు క్వాలిటీపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, తిరుమల శ్రీవారి భక్తులుకు సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అన్నారు మాజీ సియస్ ఎల్వీ సుబ్రమణ్యం. ధర్మప్రచార కార్యక్రమానికి ధర్మకర్తల మండలి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి…శ్రీవారి భక్తులుకు టిటిడి ఉద్యోగులు సంయమనంతో సేవలందించాలని కోరారు.