‘మా నాన్న రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు’.. సీఎం కూతురి సంచలన వీడియో

-

పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ సింగ్​ మాన్​ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఏకంగా సొంత కుమార్తె ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడంటూ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కుమార్తె ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

సీఎం భగవంత్ మాన్ మొదటి భార్య కుమార్తె సీరత్​ కౌర్​ తన తండ్రి​ మూడోసారి తండ్రి కాబోతున్నారంటూ వీడియోలో చెప్పారు. ఈ విషయం తమకు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని.. తమ బాధ్యతలే సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి, మరొకరికి న్యాయం ఎలా చేస్తారని వీడియోలో సీరత్ ప్రశ్నించారు. నమ్మిన వారిని మోసం చేయొద్దంటూ తండ్రిని కోరారు​.

మొదటి నుంచి తన తండ్రి అబద్ధాలు చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారని.. ఇప్పుడు పంజాబ్ ప్రజలతోనూ అలాగే ప్రవర్తిస్తున్నారని సీరత్ అన్నారు. తనకు చేసిన అన్యాయమే రాష్ట్ర ప్రజలకు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పేరును కూడా తనకు ఆపాదించొద్దని కోరారు. సీరత్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఇప్పుడు హల్​చల్ సృష్టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news