హత్యా రాజకీయాలకు తావు లేదు : మంత్రి అచ్చెన్నాయుడు

-

హత్యా రాజకీయాలకు తావు లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పలాసలో టీడీపీ నేత హత్యకు కుట్ర పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వైసీపీ నేతలు ఐదేళ్ల పాటు హత్యా రాజకీయాలు ప్రోత్సహించారని.. అధికారం కోల్పోయినా అదే పద్దతి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కుట్ర వెనుక ఎంతటి వారు ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

Achennayudu
Achennayudu

శ్రీకాకుళం జిల్లాలో హత్యా రాజకీయాలకు తావు లేదన్నారు. పలాస పట్టణానికి చెందిన ఓ టీడీపీ నేత హత్యకు కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్నన పోలీసులు ముందస్తుగానే నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వారందరూ బీహార్ నుంచి వచ్చారని.. హత మార్చేందుకు రూ.10 లక్షలు సుఫారీ తీసుకున్నారని సమాచారం రావడంతో ముఠాకు చెందిన ముగ్గురిని టెక్కలి దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నాటు తుపాకులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సుఫారీ ఇచ్చిన వారి వివరాలను నిందితులు వెల్లడించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news