రాజమండ్రి జైలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి వసతులు కల్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ తరుణంలోనే… చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు చేశారు అధికారులు.
అలాగే.. చంద్రబాబుకు స్నేహ బ్లాక్ మొత్తం కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. స్నేహ బ్లాక్ చుట్టూ జైలు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అటు జైలు గేటు దగ్గర నుంచే వెనక్కి వెళ్లిపోయారు ఎన్ఎస్జి కమాండోలు. లోపలికి వెళ్లే ముందు ఆఫీసులో తండ్రిని కలిసారు నారా లోకేష్. అనంతరం రాజమండ్రిలోనే నారా లోకేష్ బస చేశారు. అటు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి చంద్రబాబు వెళ్లుతున్న దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా, ఏపీ బంద్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. టీడీపీ బంద్ కు జనసేన సంఘీభావం తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా టిడిపి తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోందని… ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించిందని వెల్లడించారు పవన్ కళ్యాణ్.