చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇవాళ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది టీడీపీ. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ.. జగన్ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా సోమవారం బంద్కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అచ్చెన్నాయుడు కోరారు.
మరోవైపు టీడీపీకి జనసేన తన మద్దతు ప్రకటించింది.ఈ బంద్ నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థలు, పలు వ్యాపార సముదాయాలకు సెలవు ప్రకటించాయి యాజమాన్యాలు. ముఖ్యంగా ఇవాళ విద్యాసంస్థలు మూత పడనున్నాయి. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ తరుణంలోనే… చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు చేశారు అధికారులు. అలాగే.. చంద్రబాబుకు స్నేహ బ్లాక్ మొత్తం కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. స్నేహ బ్లాక్ చుట్టూ జైలు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు.