పోలీసుల నోటీసులపై సజ్జల రియాక్షన్ ఇదే..!

-

టీడీపీ కార్యాలయం దాడి చేసిన కేసులో ఇవాళ మంగళగిరి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్పందించి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అబద్దాన్ని అయినా చంద్రబాబు నిజంగా మలుచుతారని.. పోలీస్ వ్యవస్తను నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Sajjala

చంద్రబాబు ఎన్నికల హామీలను వదిలేశారు. ముఖ్యంగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు లో మళ్లీ నోటీసులు ఇవ్వడం పై సజ్జల ఫైర్ అయ్యారు. న్యాయస్థానాలపై మాకు విశ్వాసం ఉందని.. విదేశాలకు వెళ్తున్నానని తెలిసి కావాలని లుకౌట్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు సజ్జల. అక్టోబర్ 07న విదేశానికి వెళ్తే.. 10న నోటీసు ఇచ్చారు. 2021లో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగితే.. మళ్లీ కొత్తగా నోటీసులు పంపుతున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి అని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వం ఉందా..? అరాచకానికి హద్దు లేదా అని సజ్జల చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version