ఫ్యాక్ట్ చెక్ : నిమ్మరసం తీసుకుంటే ఏడే నిమిషాల్లో.. కంటి సమస్యలు మాయం..?

-

సోషల్ మీడియాలో మనకి ఎన్నో వార్తలు కనబడుతుంటాయి. ఒక్కోసారి నకిలీ వార్తలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అన్నీ నమ్మి ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా మునిగిపోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా చూసిన వెంటనే ఫాలో అవ్వకండి. అందులో నిజం ఎంత అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. తాజాగా నెట్టింట ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. మరి అది నిజమైనదా లేదంటే నకిలీదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కంటి ఆరోగ్యం పై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి.

చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే నిమ్మరసం తీసుకుంటే ఏడు నిమిషాల్లో కంటి సమస్యలను తగ్గిపోతాయని ఉంది. దీనిపై వైద్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో యాంకర్ అంజన ఓం కశ్యప్ అలాగే డాక్టర్ రాహుల్ చౌదరి ఉన్నారు. అయితే ఈ వీడియోని ఏఐ ద్వారా చేశారని లిప్ సింక్ సరిగా మ్యాచ్ అవ్వట్లేదని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా సెట్ అవ్వట్లేదని తెలుస్తోంది.

ఏఐ ద్వారా వాళ్ళు చెప్పిన మాటలు తీసేసి కొత్తగా ఇలా యాడ్ చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇలా నిమ్మరసం తీసుకోవడం వలన ఏడే నిమిషాల్లో కంటి సమస్యలు తగ్గిపోతాయని లేదు. అలాగే నానబెట్టిన బాదం తీసుకుంటే కూడా కళ్ళజోడు పెట్టుకోక్కర్లేదని ఉన్న ఆరోపణ కూడా నిజం కాదు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు లేదా వార్తలు నకిలీవా నిజమైనవా అనేది తెలుసుకుని వాటి ప్రకారం ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version