తెలంగాణ తరహానే ఏపీని కేసీఆర్‌ అభివృద్ధి చేస్తారు – తోట చంద్రశేఖర్

-

తెలంగాణ తరహానే ఏపీని కేసీఆర్‌ అభివృద్ధి చేస్తారని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం..బీజేపీ కి దేశంలో ఎదురు గాలి వీస్తోందని పేర్కొన్నారు తోట చంద్రశేఖర్. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బిఆర్ఎస్ వల్లనే అవుతుంది..తెలంగాణా రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాల ను అభివృ ద్ధి లో నడిపించాలనే కేసీఆర్ ఈ పార్టీ పెట్టారని వెల్లడించారు.

ఏపీ అభివృద్ధి పథంలో వెనుకబడి ఉంది..దేశం లో అత్యధిక నిరుద్యోం ఏపీలోనే ఉంది..గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు ఏపీ లో ఆకాశాన్నంటే విధంగా ఉన్నాయి.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు..కేంద్ర నుండి మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకు రావటంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. తెలంగాణా లో కేసీఆర్ మంచి పథకాలను తీసుకు వచ్చి రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.. ఏపీ లో ఉన్న వనరులు తెలంగాణాలో లేవు..అయినా అభివృద్ధిలో ముందుందన్నారు. తెలంగాణా లో కొన్ని లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చేలా చేసారు..ఇక్కడ ఆర్భాటాలు ఎక్కువ ఆచరణ శూన్యం..ఇంతవరకు రాజధాని నిర్మించుకోలేక పోయామన్నారు తోట చంద్రశేఖర్. పోలవరం అర్ధాంతరంగా ఆగిపోయింది.. మోడీ ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదని ఆగ్రహించారు తోట చంద్రశేఖర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version