ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. కాసేపట్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉందని… పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఐఎండి అంచనా ప్రకారం, వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతోంది ద్రోణి.
దీని ప్రభావంతో ఈ రోజు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు ఉన్నాయని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నాయని.. అలాగే మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉన్నట్లు తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.