ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈనెల 20 నుంచి హైదరాబాదులోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శరీరం మొత్తం విషతుల్యం కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శరత్ బాబు ఐసీయూలో వింటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.