తిరుమల భక్తులకు శుభవార్త.. నేటి నుంచి మార్చి దర్శన టిక్కెట్లు చేయనుంది టీటీడీ పాలక మండలి. నేటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారికి సంబంధించిన మార్చి నెల దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.
నేడు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపులు చేయనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.
- తిరుమల..11 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63598 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 20102 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.59 కోట్లు